- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS: నేడే ఎస్ఐ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 8, 9 తేదీల్లో ఎస్ఐ పోస్టులకు తుది రాతపరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు(శనివారం) అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ పేపర్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జనరల్ స్టడీస్, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 వరకు లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. ఎగ్జామ్ బుక్ లెట్ ప్రింట్ ఇంగ్లీష్/ తెలుగు, ఇంగ్లీష్/ఉర్దూ.. రెండు భాషల్లో ఉంటుందని బోర్డు అభ్యర్థులకు సూచించింది. బయోమెట్రిక్ విధానం ఉండడం వల్ల చేతులకు టెంపరరీ టాటూలు, మెహందీలు ఉండకూడదని బోర్డు పేర్కొంది. ఎగ్జామ్ కేంద్రానికి హాల్ టికేట్‌తో పాటు ఒక పాస్ ఫోటో అభ్యర్థి వెంట తెచ్చుకోవాలని బోర్డు సూచించింది.
అయితే, 8వ తేదీనే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పరీక్ష రాసే ఎస్ఐ అభ్యర్థులు.. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హైదరాబాద్ పోలీసులు అభ్యర్థులకు సూచించారు. మోడీ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రభావం నగరం అంతటా పడే అవకాశం ఉండడం చేత అభ్యర్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దాదాపు అన్ని రహదారులు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున తమ పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందే వెళ్లేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు, ఎస్ఐ అభ్యర్థులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.