తెలంగాణలోని ఈ రెండు జిల్లాల్లో ఫైలేరియా, నులిపురుగులు తీవ్రత

by Mahesh |
తెలంగాణలోని ఈ రెండు జిల్లాల్లో ఫైలేరియా, నులిపురుగులు తీవ్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో ఫైలేరియా(బోధకాలు), నులి పురుగుల తీవ్రతను తగ్గించేందుకు ఆరోగ్యశాఖ స్పెషల్ ప్రోగ్రామ్ ను చేపట్టింది. ఈ రెండు జిల్లాల్లోని 14 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేసి ఈ నెల 25 వరకు డ్రైవ్ చేపట్టనున్నారు. ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో దాదాపు 2,600 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఇందులో 2522 మందికి మాస్ డ్రగ్ విధానంలో మెడిసిన్స్ అందజేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ ను మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు. ఇక జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నివారణ కార్యక్రమం లో భాగంగా కేంద్ర ఆయుష్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ శనివారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నివారణ కు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిల లోని ప్రజలకు బోధకాల వ్యాధి, నులిపురుగుల వ్యాధి నివారణకు డీఈసీ, ఆల్బెండజోల్ ,హైవర్ మెక్టిన్ మాత్రల డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో హెల్త్ సెక్రటరి క్రిస్టినా చొంగ్తూ, అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed