ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Rajesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, చేగుంట : అతివేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం బైపాస్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మేకల వ్యాపారం చేసే రాజు (45), మనీ (40) లారీలో మేకలను తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో ఎదురుగా వెళ్తున్న దానా లారీని అతివేగంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లారీలను పక్కకు తొలగించారు.

Next Story