- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నేనూ రైతునే.! తెలంగాణలో పెరిగిన ఫామ్ హౌజ్కల్చర్
నాకు పట్టాదారు పాసు బుక్ ఉన్నది. నేనూ రైతునే. నాకూ రైతుబంధు వస్తుంది. రైతుబీమాకు ఎలిజబుల్. ఇది ఇప్పుడు సోషల్ స్టేటస్ గా మారింది. ప్రతి ఒక్కరూ రైతుననిపించుకోవాలన్న ప్రయత్నం. అది సామాన్యుడి నుంచి ఐఏఎస్ వరకు, వార్డు మెంబర్ నుంచి మంత్రి వరకు అంతే. వ్యవసాయం అంటే తెలియదు. దున్నడం అంటే ఏమిటో అవగాహన లేదు. కానీ కాస్తయినా పొలం ఉండాలి. దానికి నేను యజమాని.. అనిపించుకుంటే చాలు. అందులో ఎంత దిగుబడి వస్తున్నది అవసరం లేదు. ఆఖరికి రెండు గుంటల భూమి ఉన్నా చాలు. గ్రీన్ కలర్ పాసు పుస్తకం తన పేరిట ఉంటే అదే స్టేటస్ సింబల్! అన్ని వర్గాలదీ ఇప్పుడదే దారి.
దిశ, తెలంగాణ బ్యూరో: సంపన్న వర్గాల నుంచి మధ్య తరగతి వర్గం వరకు భూమిని కోరుకుంటున్నారు. భూమి స్వభావం ఎలాంటిదైనా ఫర్వాలేదు. ఆఖరికి గుట్టలు, పుట్టలు.. ఏదైనా సరే. ఓ రెండు గుంటలు తన పేరిట ఉంటే ఆ ఆనందమే వేరంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఏ వర్గమైనా భూమి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాగూ ఆదాయపు పన్ను నుంచి విముక్తి పొందేందుకు కూడా అవకాశం ఉన్నది. అది కూడా ఓ కారణంగా కనిపిస్తున్నది. వ్యవసాయం చేసి ఇంటికి తిండిగింజలు తీసుకెళ్తామన్న నమ్మకం ఏమీ లేదు. కనీసం ఆ భూమిలో ఏదైనా పంట వేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. కానీ మాకూ పొలం ఉన్నదని చెప్పుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ మూడేండ్లల్లోనే తెలంగాణలో కొత్తగా 10.59 లక్షల రైతులు పుట్టుకొచ్చారు. రైతుబంధు పొందుతున్న పట్టాదారుల సంఖ్య 60.80 లక్షలైతే అందులో 17.5% కొత్తగా భూమి హక్కులు పొందినవారేంటే ఆశ్చర్యం కలుగుతున్నది.
ఫామ్ హౌజ్ కల్చర్
రైతులు, వ్యవసాయం.. బదులుగా భూమి, ఫాంహౌజ్ కల్చర్ గా మారుతున్నది. రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామి కవేత్తలకు ఫాంహౌజ్‌లు ఉన్నాయి. అటు వ్యవసాయం చేస్తున్నామంటూనే సకల వైభోగాలు అనుభవించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలతో భవనాలు కట్టుకుంటున్నారు. వీకెండ్.. కాదు కాదు. ఎప్పుడంటే అప్పుడే అక్కడ సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. ఏ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న ఫామ్ హౌజ్‌లు మీటింగులు ఇప్పుడు ట్రెండ్ గా మారింది. సెటిల్మెంట్లు, ఇతర దందాలకు కేంద్రాలు మారుతున్నాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు కూడా ఫాంహౌజ్ ల్లోనే నిర్వహించేందుకు ఇష్టపడుతున్నారు. నగరాల్లో ఉండే వారు కాదు. జిల్లా, మండల కేంద్రాల్లో ఇతర పనులు, వృత్తుల్లో ఉన్న వారు కూడా ఈ కల్చర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు గుంటల వ్యవసాయ భూమి తమకు ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఈ మూడేండ్లల్లో అతి తక్కువ భూమితో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల సంఖ్య లక్షల్లో ఉన్నాయి. గుంట నుంచి ఐదు గుంటల వరకు భూ విస్తీర్ణంతో కూడిన రైతుల సంఖ్య పెరిగింది.
రైతుబీమా ఎఫెక్ట్
గతంలో భూమి కలిగిన రైతులు కూడా వారసుల పేరిట మార్చేస్తున్నారు. ఇంటి యజమాని చనిపోయిన తర్వాత చేసే పంపకాలు ఇప్పుడు బతికుండగానే విరాసత్ చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట భూమి ఉండేటట్లుగా మార్చేస్తున్నారు. రైతుబంధు ఎలాగూ వస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే భరోసాగా ఉంటుందన్న అభిప్రాయం కూడా నెలకొన్నది. ఫామ్ హౌజ్కల్చర్ తో కొనుగోలు చేసే వారు కూడా దీన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వం బెనిఫిట్స్ పొందేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ ఫౌంహౌజ్పేరిట ప్లాట్లు విక్రయించే వారు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. మీకు పట్టాదారు పాసు పుస్తకం వస్తుంది. రైతుబంధు సొమ్ము మీ ఖాతాలో పడుతుంది. రైతుబీమాకు అర్హులవుతారంటూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.
రైతుబంధు లబ్ధిదారులు
మూడేండ్లల్లోనే పెరిగిన రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 10,59,929
64.6 శాతం మంది రైతులు 2.20 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులే. ఆ తర్వాత 23.7 శాతం మంది ఐదెకరాల్లోపు ఉన్నవారే. అంటే 88.3 శాతం మంది రైతుల దగ్గర ఉన్న భూమి 91,01,000 ఎకరాలు. మిగిలిన 11.7 శాతం మంది దగ్గర ఉన్న భూమి 56,59,000 ఎకరాలు.
రైతుబంధు లబ్ధిదారులు (అత్యధికం)
ఫౌంహౌజ్ ప్లాట్లు అమ్మకాలు సాగుతున్న జిల్లాల్లోనే రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య కూడా అత్యధికంగా కనిపిస్తున్నది. ఆయా జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోనూ ఆన్ లైన్‌లోనే లే అవుట్లు చూపించి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దీనికి డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులేవీ అవసరం లేకపోవడంతో దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.