- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మద్దతు ధర చెల్లించకుంటే కఠిన చర్యలు
దిశ, వేములపల్లి :ధాన్యం కొనుగోలు చేస్తున్న బిల్డర్లు రైతులకు మద్దతు ధర చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై డీసీఎం వాహనం ఢీకొనడంతో..వడ్ల లోడుతో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకొని,బాధిత రైతును పరామర్శించారు. అనంతరం సమీపంలోని మిల్లర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని,నిర్లక్ష్యం వహించిన మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం దిగుమతులను వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులతో పాటు.. తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, రైతులు ఉన్నారు.