- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ధరణిలో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు తొలగింపు...
దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామం వెంకటాపూర్లో సర్వేనెంబర్ 174 లో 18.12 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదే అని అధికారులు తేల్చేశారు. శనివారం 'దిశ' వెబ్ న్యూస్ లో 'ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం' శీర్షికన ప్రభుత్వ భూముల బదలాయింపు విషయం పై సమగ్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులు ఆదేశాల మేరకు సర్వేనెంబర్ 174 లో దాదాపు 12 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులు తమ పేరున రికార్డులలోకి ఎక్కించుకున్న విషయాన్ని అధికారులు విచారణ జరిపి ధరణి పోర్టల్ నుంచి ప్రైవేట్ వ్యక్తుల పేర్లను తొలగించి ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు.
శనివారం సాయంత్రం వరకు ధరణి పోర్టల్ లో కొర్రేముల గ్రామం వెంకటాపూర్ లోని సర్వే నెంబర్ 174 లో కనిపించిన ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఆదివారం ఉదయం వరకు కనిపించకుండా పోయాయి. అయితే 12 ఎకరాల ప్రభుత్వ భూమి తమదేనంటూ తప్పుడు దస్త్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లోకి చేరిన మాజీ ఎంపీటీసీ రామారావుతో పాటు నలుగురు వ్యక్తుల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై జిల్లా అధికారులపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను, అందుకు సహకరించిన అధికారులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.