- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దిశ, దమ్మపేట : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన దమ్మపేట మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఏపీలోని జిలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు(30) గత కొంతకాలంగా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు పద్ధతిలో ఈఎఫ్ బీ విభాగంలో ఫైబర్ తరలించే ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి విధులకు హాజరైన వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో ఫ్యాక్టరీ ఆవరణలో మృతిచెందాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వెంకటేశ్వరరావుకు గుండెపోటు రావడంతో ఫ్యాక్టరీ సిబ్బంది దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చినట్టు ఆరోగ్య కేంద్ర సిబ్బంది తెలిపారు.
పరీక్షించిన ఆసుపత్రి సిబ్బంది వెంకటేశ్వరరావు అప్పటికే మృతి చెందినట్టు పేర్కొన్నారు. ఈ మృతిపై ఇక్కడే అసలు అనుమానం కలుగుతుంది. కర్మాగారంలో ఒకరు మృతి చెందితే కనీసం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే మృతుడు స్వస్థలం అంకంపాలెంకు తరలించాల్సిన అవసరం ఏముందని అనుమానిస్తున్నారు. మరోపక్క ట్రాక్టర్బుల్ తగలడంతో మృతి చెందాడనే ప్రచారం కూడా ఉంది. ఈ సంఘటనపై ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని అశ్వారావుపేటకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వచ్చే నివేదిక ఆధారంగా అనుమానాలు తొలగనున్నాయి. ఏది ఏమైనా ఇటీవల పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.