- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 సంవత్సరాల తరువాత ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక..
దిశ, ఖమ్మం రూరల్ : రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో 60 ఏళ్ల తర్వాత ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. 2019 వరకు కూడా ఈ గ్రామంలో సీపీఎం పెత్తనం నడిచింది. ఇతర పార్టీలు గ్రామంలో కనీసం ఊసే లేకుండా పోయింది. తమ్మినేని కృష్ణయ్య సీపీఎంకు వ్యతిరేకంగా బయటకు వచ్చి ఎంపీటీసీ బరిలో నిలబడి కృష్ణయ్య భార్య ను గెలిపించుకుని విజయకేతనం ఎగురవేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని కృష్ణయ్య తనయుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
సుమారు 5 ఐదు దశాబ్దాల అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడుగా గజ్జి వీరబాబు, ఉపాధ్యక్షులు బోడపట్ల రమేష్, కార్యదర్శి చావ సతీష్, సహాయ కార్యదర్శి చాట్ల రవి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు తమ్మినేని నవీన్ తెలిపారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన తెలిపారు. శాంతిభద్రతల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు నెల్లూరు వినోద్ గ్రామ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.