- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
CM Revanth Reddy: ‘ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. పాలమూరును పచ్చటి పైర్లతో విలసిల్లేలా చేస్తాం’
దిశ, వెబ్‌డెస్క్: కురుమూర్తిస్వామి ఆలయంలో సంపూర్ణ వసతులు లేవనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకే ఆలయ అభివృద్ధి కోసం రూ.110 కోట్లతో పైకి దారిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల తిరుపతిగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తామని, అలాగే మన్నెంకొండ జాతరను, స్థానిక ఆలయాల్లోని అన్ని జాతరలను తాము గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి(Sri Kurumurthy Swamy)ని ఈ రోజు (ఆదివారం) దర్శించుకున్న సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజల ఆకాంక్షలతో పాటు స్వామివారి ఆశీస్సులతో అతి త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించిన ఖర్చులపై అంచనాలు వేసి తనకు సమర్పించాలని కలెక్టర్‌కు సీఎం స్వయంగా ఆదేశాలిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ పాలమూరు జిల్లా వలసలకు మారుపేరుగా నిలిచింది. తట్టపని, మట్టి పని చేసుకుంటూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారు. కానీ ఇక్కడ మన ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. 2009లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపించినా ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. ఎంపీగా వెళ్లిన ఆయన తెలంగాణ సాధనలో తన భాగస్వామ్యాన్ని నిర్వర్తించారు. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయారు.
జూరాల ప్రాజెక్ట్, కోయెల్ సాగర్, భీమా, నెట్టంపాడు,కల్వకుర్తి ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కావచ్చు. ఏదీ ఆయన పూర్తి చేయలేకపోయారు. ఆ నాడు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరిదీ అని అన్నారు. వారి స్ఫూర్తిగా దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి పచ్చటి పైర్లతో ఈ జిల్లాను విలసిల్లేలా చేసి వలసల నుంచి ప్రజలను రక్షిస్తాం’’ అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.