- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19న పెద్దవంగరలో భూ న్యాయ శిబిరం: లీఫ్స్
19న పెద్దవంగరలో భూ న్యాయ శిబిరం
ఉచితంగా భూ సమస్యల పరిష్కార సేవలు
లీఫ్స్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్
దిశ, తెలంగాణ బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భూ సమస్యలను సృష్టించిన ధరణి పోర్టల్ ని రద్దు చేసి భూమాతను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా లీఫ్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలాన్ని దత్తత తీసుకోని పది గ్రామాల్లో భూ న్యాయ శిబిరాలను నిర్వహించింది. భూ సమస్యలను గుర్తించి, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పది గ్రామాల్లోనే 2,114 మందికి 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబధించిన భూమి సమస్యలు గుర్తించింది. అలాగే గతంలో లీఫ్స్ సంస్థ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర, బొమ్మకల్, జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర, సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండలం వెంపటి, నాగారం, ఫణిగిరి గ్రామాలను దత్తత తీసుకుంది. ఇక్కడ కూడా సమస్యలను అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 19న(గురువారం) మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగరలో "భూన్యాయ శిబిరం" భూమి హక్కుల పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లీఫ్స్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్ తెలిపారు. భూ న్యాయ శిభిరానికి లీఫ్స్ అధ్యక్షులు భూమి సునీల్ కుమార్, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం గారు, సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి, రెవెన్యూ చట్టాల నిపుణులు పాల్గొంటారు. మిగతా బొమ్మకల్, బమ్మెర, వెంపటి, ఫణిగిరి గ్రామాల్లో కూడా త్వరలోనే భూన్యాయ శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భూమి సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా సలహాలు ఇవ్వనున్నారు. భూమికి భూసార పరీక్షలు, మనుషులకు ఆరోగ్య పరీక్షల మాదిరిగానే భూమికి ఏమైనా చిక్కులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం "భూహక్కుల పరీక్ష" ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వేలాది మంది రైతులకు ఈ భూ హక్కుల పరీక్ష నిర్వహించి హక్కులపై రిపోర్ట్ అందించారు.