- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ ,ఆయన సోదరుడు బెదిరిస్తున్నారని రైతుల ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్ : కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని CM రేవంత్, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు కేటీఆర్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ భూములను సేకరించి ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఇవ్వాలని భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం చెందిన పలువురు రైతులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు.
దుద్యాల్ మండలంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు సీఎం రేవంత్, అతని సోదరుడు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ కు వారు వివరించినట్లు BRS ట్వీట్ చేసింది. ఫార్మా కంపెనీల రాక వల్ల కాలుష్యం పెరుగుతుందని, ఇది తమ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని వారు కేటీఆర్ తో తమ బాధను చెప్పుకున్నారు. తమ భూములు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి సోదరుడు ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయ భూములే తమకు ప్రధాన జీవనాధారమని ,లక్షల కోట్ల విలువైన భూములను లాక్కోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. వ్యవసాయ భూమిని కోల్పోతే తమ జీవితాలు నాశనమవుతాయని రైతులు అన్నారు. కేటీఆర్ ఈ విషయంపై స్పందిస్తూ.. భూములను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.