- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాత అరిగోస.. తడిసిన ధాన్యం చూసి రైతన్న కన్నీళ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈయాసంగి సీజన్లో వరి సాగు చేసిన రైతులు అరిగోస పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కురుస్తున్న వడగళ్ల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కోతకు వచ్చిన పంట పొలాల్లోనే వడ్ల రాలిపోతుండగా, ఇప్పటికే కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తుతోంది. చేతి కందిన పంట నీటి పాలు కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై సర్కార్ నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ఈఏడాది యాసంగి సీజన్లో వరి సాగు చేసిన అన్నదాతకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామాన్ని వదలకుండా వడగళ్ల వర్షాలు కురవడంతో పెద్ద మొత్తంలో వరి పంటకు నష్టం జరిగింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు ఎడతెరపిలేకుండా కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిళ్లింది. కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం కొట్టుకుపోగా కొన్ని చోట్ల చుట్టూ నీరు నిలిచి ధాన్యం మొత్తం తడిసింది.
దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈయాసంగి సీజన్లో వరి సాగు చేసిన రైతులు అరిగోస పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కురుస్తున్న వడ్లగళ్ల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కోతకు వచ్చిన పంట పొలాల్లోనే వడ్ల రాలిపోతుండగా, ఇప్పటికే కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తుతుంది. చేతి కందిన పంట నీటి పాలు కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యతం అవుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై సర్కార్ నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.
రైతులకు కన్నీళ్లే...
ఈ ఏడాది యాసంగి సీజన్లో వరి సాగు చేసిన అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామాన్ని వదలకుండా వడగళ్ల వర్షాలు కురవడంతో పెద్ద మొత్తంలో వరి పంటకు నష్టం జరిగింది. గతంలో ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వర్షాలు కురిసినప్పటికీ ఒక్కటి, రెండుసార్లు మాత్రమే కురవడంతో నష్టం తక్కువ ఉండేది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన వర్షాలు క్రమం తప్పకుండా కురుస్తుండడంతో అన్నదాతలకు కొలుకోలేని నష్టం జరుగుతుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు ఎడతెరపిలేకుండా కురవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పొలాల్లో వడ్లు రాలిపోయి నష్టం వాటిళ్లింది. వరికోతలు పూర్తయిన రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి కొట్టుకుపోగా కొన్ని చోట్ల చుట్టూ నీరు నిలిచి ధాన్యం మొత్తం తడిసిపోయింది.
రికార్డు స్థాయిలో వర్షం..
ఆదివారం రాత్రి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో అత్యధికంగా 86.2మిల్లీ మీటర్లు, చొప్పదండిలో 52మిల్లీ మీటర్లు, తిమ్మాపూర్‌లో 47.8మిల్లీ మీటర్లు, చిగురుమామిడిలో 49.6మిల్లీ మీటర్లు, శంకరపట్నంలో 47.8మిల్లీ మీటర్లు, గంగాధరలో 46.8మిల్లీ మీటర్లు, మానకొండూర్‌లో 41.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 20మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలంలో అత్యధికంగా 71.9మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లిలో 61.3మిల్లీ మీటర్లు, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో 54 మిల్లీ మీటర్లు, అంతర్గాం మండలంలో 47.4మిల్లీ మీటర్లు, రామగుండం మండలంలో 49.1 మిల్లీ మీటర్లు, పాలకుర్తి మండలంలో 34.6, ధర్యమారం మండలంలో 34.6మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుదైంది.
జగిత్యాల జిల్లాలో...
జగిత్యాల జిల్లాలో వెల్గటూర్ మండలంలో 75.7మిల్లీ మీటర్లు, బుగ్గారంలో 70.5మిల్లీ మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 45.6 మిల్లీ మీటర్లు, మేడిపల్లిలో 47.7మిల్లీ మీటర్లు, కొడిమ్యాలలో 47.9 మిల్లీ మీటర్లు, పెగడపల్లిలో 45.4మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో సైతం 30మిల్లీ మీటర్ల కంటే ఎక్కువే నమోదైంది.
సిరిసిల్ల జిల్లాలో...
సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 47.2 మిల్లీ మీటర్లు, చందుర్తి మండలంలో 45.4మిల్లీ మీటర్లు, వేములవాడలో 42.3 మిల్లీ మీటర్లు, బోయిన్పల్లి మండలంలో 38.5మిల్లీ మీటర్లు, గంబీరావుపేట మండలంలో 38.5మిల్లీ మీటర్లు, ముస్తాబాద్‌లో 35.5మిల్లీ మీటర్లు నమోదైంది. మిగిలిన మండలాల్లో 20మిల్లీ మీటర్ల కంటే అధికంగా నమోదైంది.
తడిసిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత కరువు...
గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎటువంటి స్పష్టత కనిపించడం లేదు. ఇందుకు కారణం తడిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. వర్షాలకు తడిసిన ధాన్యం రంగు మారడంతోపాటు మొలకెత్తడం వంటి ప్రక్రియ జరుగుతుంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ర్ట పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా కరీంనగర్లో ప్రకటించినప్పటికీ ఇందుకు సంబంధించిన ఎటువంటి నిబంధనలు విడుదల కాలేదని అధికారులు అంటున్నారు.
నిలిచిపోయిన కొనుగోళ్లు..
అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఓ వైపు ఎడతెరపి లేని వర్షాలు.. మరోవైపు ముందుకు సాగని కొనుగోళ్లతో అన్నదాతల కంటిమీద కునుకు ఉండడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లిన రైతు కంట కన్నీరు ఆగడం లేదు. ఆదివారం రాత్రి కురిసిన వర్షాలు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 45వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు అధికారులు అంచనా వేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నష్టపోయిన పంటల పరిశీలన
దిశ, మానకొండూర్ : మానకొండూర్ మండలంలోని ఊటూర్, పచ్చునూర్, వేగురుపల్లి, లక్ష్మీపూర్, వెల్ది, డేవంపల్లి, అన్నారం, గంగ్గిపల్లి, లింగాపూర్ గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. సోమవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వాసురెడ్డి శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఊటూర్, పచ్చునూర్, వేగురుపల్లి, వెళ్ది, దేవంపల్లి, అన్నారం, లక్ష్మిపూర్ గ్రామాల్లో సుమారు 1000 నుంచి 1500 ఎకరాల్లో అధికంగా పంట నష్టపోయినట్లు అంచనా వేశారని ఏఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు.