- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ పత్రిక పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్ ప్రచారం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ‘దిశ’ పత్రికపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ‘దిశ’ పత్రికకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు సోషల్ మీడియాలో ‘దిశ’ పేరుతో ఫేక్ క్లిప్పులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా దిశ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఫేక్ క్లిప్ చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ 18 స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదని.. దీంతో కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో దిశ పత్రిక పేరుతో ఫేక్ క్లిప్ ప్రచారం అవుతోంది. అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రగతిభవన్ సిబ్బందికి కేసీఆర్ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ఈ వార్తలో పేర్కొన్నారు. నందిహిల్స్‌లోని పాత ఇంటికి సామాన్లు తరలించాలని చూస్తున్నారని.. కేటీఆర్, కవిత మాత్రం ఇక్కడ ఉంటే ఇబ్బందులు తప్పవని అమెరికా వెళ్దామని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు దిశ పత్రిక పేరుతో చక్కర్లు కొడుతున్న క్లిప్‌లో రాసుకొచ్చారు. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న ఈ క్లిప్‌కు దిశ పత్రికకు ఎలాంటి సంబంధం లేదని దిశ యాజమాన్యం తెలిపింది. దిశ పత్రిక రెగ్యూలర్ ఎడిషన్‌లో గానీ, డైనమిక్ ఎడిషన్లలో కానీ ఎక్కడ పై వార్తను ప్రచురించలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.