అక్షరాల కోటి.. 'కేసీఆర్' టార్గెట్ ఇదే!

by Nagaya |   ( Updated:2022-11-23 13:51:33.0  )
అక్షరాల కోటి.. కేసీఆర్ టార్గెట్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది జనవరి18వ తేదిన స్టార్ట్​కానున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కోటి 5 లక్షల మందికి స్క్రీనింగ్​చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. సుమారు 6 నెలల పాటు ప్రజలకు కంటి పరీక్షలు చేయనున్నారు. సర్కారీ ఆసుపత్రులలోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ కంటి క్యాంపులు పెట్టనున్నారు. 55 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వీటిలో30 లక్షల రీడింగ్​,మరో 25 లక్షల మందికి ప్రిస్కిప్షన్​గ్లాస్​లను ఇవ్వనున్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది అప్తమాలజీ డాక్టర్లు భాగస్వామ్యం కానున్నారు. ఇతర టెక్నిషియన్లు, సపోర్టెట్​స్టాఫ్​కూడా ఉంటారు. కంటి వెలుగు స్టాఫ్​రిక్రూట్​కు వైద్యశాఖ విభాగాల వారీగా నోటిఫికేషన్లను ఇవ్వనున్నది. వీరందరినీ టెంపరరీ విధానంలో నియామకాలు చేయనున్నారు.

ప్రతీ ఆసుపత్రిలో వేర్వేరు విభాగం..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులతో పాటు మెడికల్​కాలేజీ దవాఖాన్లలో కంటి వెలుగుకు సపరేట్​విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి కేసీఆర్​కంటి వెలుగు సెంటర్లుగా నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ప్రతీ విభాగంలో ఓ డాక్టర్, అప్తమాలజీ అసిస్టెంట్, ఇద్దరు స్టాఫ్​నర్సులు, ఓ టెక్నికల్ స్టాఫ్​ఉండనున్నారు. వీరు ఆయా ఆసుపత్రులలో ఉండే సమన్వయమై పేషెంట్లకు పరీక్షలు చేయనున్నారు. అయితే ఈ సారి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కంటి పరీక్షలు చేయాలని సర్కార్​ప్లాన్ చేసింది. తొలి విడత పెద్దలకు కంటి స్క్రీనింగ్​లు నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. రెండో రౌండ్​లో పిల్లలకు పరీక్షలు చేయనున్నారు. స్కూళ్ల వారీగా విద్యార్థులను ఎంపిక చేసి కంటి చెకప్​లను నిర్వహించనున్నారు.

మూడేళ్లకు ఓసారి జరిగేలా...

ఈ సారి కంటి వెలుగు కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతీ మూడేళ్లకోసారి ఇలాంటి క్యాంపులను నిర్వహించేలా సర్కార్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నది. ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన సపరేట్​ కేంద్రాల్లో ట్రైనింగ్, ఎక్విప్​మెంట్లు, చెకప్​లు వంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ క్యాంపులలో స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత సర్జరీ కోసం కోసం ఆసుపత్రులకు రిఫరల్ చేయనున్నారు.అయితే ఈ సారి పేషెంట్​కు ఆపరేషన్​ పూర్తయ్యే వరకు కంటి వెలుగు టీమ్​లు ఫాలప్​చేయనున్నారు. ప్రత్యేక సాప్ట్​వేర్​విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో ఇలాంటి పట్టింపు లేకపోవడం వలనే సర్కార్ కు కొంత చెడ్డపేరు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉండగా,రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు మొదటి విడత 9,901 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి 1,54,72,849 మందికి పరీక్షలు చేశారు. అందులో 1,04,33,854 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మరో 50,38,995 మందికి వివిధ రకాల కంటి సమస్యలున్నట్టు గుర్తించారు. వీరిలో 36,11,501 మందికి అద్దాలు పంపిణీ చేశారు. అయితే ఇందులో 22.93 లక్షలు రీడింగ్ గ్లాసులే కావడం గమనార్హం. ఇక 6,42,290 మందికి క్యాటరాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శుక్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని తేల్చారు. వీరిలో కొద్ది శాతం మందికి ఆపరేషన్లు చేసి, ఆ తర్వాత మిగిలిన వాళ్లను పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed