'పదవీ కాలం పొడగింపును రద్దు చేయాలి'.. సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Vinod kumar |
పదవీ కాలం పొడగింపును రద్దు చేయాలి.. సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సుప్రీం కోర్టు ఇచ్చిన తీరును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అదే పదవిలో నియమించడం, ఓఎస్డీలుగా, సలహాదారులుగా నియమించడానికి ముగింపు పలకాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు. భవిష్యత్‌లో పదవీ విరమణ చేసినవారికి ఎలాంటి ఎక్స్ టెన్షన్లు ఇవ్వకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో.. ఈ నెల 11న ఎస్ కె సిన్హా కు మూడోసారి ఇడీగా పదవీకాలం పొడగింపు అక్రమమని సుప్రింకోర్టు రద్దు చేసిందన్నారు. కోర్టు అర్డర్‌లో తరచుగా ఒకే అధికారికి ఎక్స్ టెన్షన్ ఇవ్వడం అంటే లాలూచీ పడినట్లుగానే చూడాలన్నారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒక అధికారి పదవికాలం పొడగించడం ప్రభుత్వ ఇష్టానుసారంగా కాకుండా ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉండాలని అన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 2014 నుంచి సలహాదారులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జీవో 55 , 2015 మే 2తో రీ అపాయింట్ మెంట్ గానీ, ఓఎస్డీగా కానీ, సలహదారులగా కానీ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందన్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా చాలా మంది పదవీ విమరణ చేసిన ఉద్యోగులను సలహాదారులుగా, ఓఎస్డీలుగా, కన్సల్టెంట్లుగా నియామకం చేస్తున్నారని ఆరోపించారు. సరైన రూల్స్, పాలన పద్దతులు లేక పదవీ విరమణ చేసిన చేసిన అధికారులను తిరిగి వారికే బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉద్యోగంలో ఉన్న అధికారులు తప్పులు చేసినా, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి సీసీఏ రూల్స్ ఉన్నాయని, కానీ పదవీ విరమణ చేసి తిరిగి పనిచేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరన్నారు.

Advertisement

Next Story

Most Viewed