గుడ్‌న్యూస్: దసరా సెలవులు పొడిగింపు

by GSrikanth |   ( Updated:2023-11-03 07:02:41.0  )
గుడ్‌న్యూస్: దసరా సెలవులు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: JNTU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వగా.. 25న కూడా సెలవుగా ప్రకటించారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందంటూ రిక్వెస్టులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story