- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారా?.. లేదా?
దిశ, వెబ్‌డెస్క్: పెండింగ్ చలాన్లు క్రియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి.. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ కావడం గమనార్హం.
కాగా, ప్రభుత్వం కల్పించిన రాయితీలో ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాలపై 50% రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గడువు ముగియడంతో ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో చలాన్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2024
గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు… pic.twitter.com/OKygNZHxz1