- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుల సరఫరాకు ముగిసిన గడువు.. వారితో కుమ్మక్కైన వైద్యశాఖ!!
దిశ, నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌కు మందుల సరఫరా చేసే కాంట్రాక్టు టెండర్ నేటితో ముగియనుంది. కాంటాక్ట్ ముగిసే వరకు కొత్త టెండర్లను ఆహ్వానించి దాని ప్రకారం మందుల సరఫరా కోసం ఏజెన్సీ ఎంపిక చేయాల్సిన అధికారులు కుట్రపూరితంగా ఇప్పుడున్న కాంట్రాక్టర్‌కు అంటకాగుతూ తమ ఇష్టానుసారంగా ఫైల్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రెండేళ్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌కు ఓ మెడికల్ ఏజెన్సీ మందులు సరఫరా చేసింది. ఈ రెండేళ్లలో సరఫరా చేసిన మొత్తం మందుల విలువ సుమారు రూ.3.5 కోట్లు అయినట్లు తెలిసింది. అందులో రూ.1.5కోట్లు మందులు సరఫరా చేసే ఏజెన్సీకి చెల్లించినట్లు సమాచారం. ఇంకా మరో రూ.2 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే టెండర్ గడువు ముగిసే కంటే నెల రోజుల ముందే హాస్పిటల్ అధికారులు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే అధికారులు నిబంధనల ప్రకారం చేయకుండా మెడికల్ ఏజెన్సీ కాంట్రాక్టర్‌కు అడుగులకు మడుగులొత్తుతూ వ్యవహరిస్తున్నరని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి టెండర్లు పిలిస్తే ఇప్పుడున్న ఏజెన్సీ దారుడికి రాకపోతే ఇబ్బందిగా ఉంటుందని భావించి గడువు ముగిస్తున్నప్పటికీ టెండర్లు పిలవలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే గుట్టుచపుడు కాకుండా జూలై నెల మొదట్లో ఏజెన్సీ దారుడు మందులు సరఫరా చేసేందుకు మరొక సంవత్సరం గడువు పొడిగించాలని కోరుతూ జిల్లా పాలనాధికారికి వైద్య శాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేసి పంపినట్లు తెలిసింది. ఆ ఫైల్‌ను పరిశీలించిన పాలనాధికారి నూతన టెండర్ ఆహ్వానించకుండా ఎలా ఎడాదికాలం పొడిగించాలని ఫైల్ పంపారని వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం తెలిసింది. దాంతో అధికారులు ఫైల్‌ను తిరిగి తీసుకొని వచ్చి మూడు నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ మళ్లీ జిల్లా కలెక్టర్కు ఫైల్ సిద్ధం చేసి పంపినట్లు సమాచారం. మూడు నెలల్లో చొప్పున మొత్తంగా ఈ ఏడాదంతా ఇప్పుడున్న కాంట్రాక్టర్‌కు మందుల సరఫరా చేసే టెండర్ ఉండేలా చూడాలని అధికారులు ఒక కుట్రకు తెర లేపినట్లు సమాచారం.
వారం రోజుల క్రితమే ఛార్జ్ తీసుకున్నా: రమణమూర్తి, సూపరిండెంట్ ప్రభుత్వ హాస్పిటల్
టెండర్ ముగుస్తున్న క్రమంలో కొత్త టెండర్లు పిలవడానికి నెలరోజుల ముందే చర్యలు తీసుకోవాలి. కానీ గతంలో ఏం జరిగిందనేది తెలియదు. నేను ఛార్జి తీసుకుని ఐదు రోజులు మాత్రమే అవుతుంది. హాస్పిటల్‌కు డ్రగ్స్ సరఫరా ఆగిపోవద్దని ఉద్దేశంతో కలెక్టర్ అనుమతితో మూడు నెలలకు పొడిగించాం.