Union Budget 2024:పేదలకు ఇళ్లు..‘PMAY స్కీమ్’ విస్తరణ

by Jakkula Mamatha |
Union Budget 2024:పేదలకు ఇళ్లు..‘PMAY స్కీమ్’ విస్తరణ
X

దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభలో ఇవాళ (మంగళ వారం) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 2024-2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమావేశంలో పీఎం ఆవాస్ యోజనకు కేంద్రం పెద్దపీట వేసింది. పట్టణ ప్రాంతాల్లో కోటి మంది పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాబోయే ఐదేళ్లలో కేంద్ర సాయం కింద రూ.2.2 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. పథకాన్ని మరో 3 కోట్ల ఇళ్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. సూర్యా ఘర్ ముఫ్త్ బిజిలీ కింద కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చనుంది. ఈ స్కీమ్‌కు 1.28 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed