- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ పాలమూరు మంత్రికి ఎక్సైజ్, పర్యాటక శాఖలు
X
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు మళ్లీ ఎక్సైజ్, పర్యాటక శాఖలు దక్కడం పట్ల సర్వత్ర చర్చనీయాంశం అవుతుంది. 2018 ఎన్నికలలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించిన వి.శ్రీనివాస్ గౌడ్‌కు కేసీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖలు దక్కాయి. పూర్తి కాలం ఆ శాఖలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు.
ఇటీవల జరిగిన ఎన్నికలలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన జూపల్లి కృష్ణారావుకు యాదృచ్ఛికంగా ఎక్సైజ్, పర్యాటకశాఖలు దక్కాయి. ఎక్సైజ్ శాఖ సంగతి అటు ఉంచితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. వాటన్నింటినీ గుర్తించి అభివృద్ధి చెందిస్తారు అన్న ఆశాభవాన్ని ఉమ్మడి జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story