- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి: కేటీఆర్
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని రైతులు రుణమాఫీ కాకపోవడంతో రగిలిపోతుంటే.. సీఎం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేవలం ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా అంటూ ప్రశ్నించారు. అలాగే మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని.. ఇలా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తి చేసెదెవరని ప్రశ్నించారు. రైతులకు మాయమాటలు..ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
Advertisement
Next Story