Jagadish Reddy: ఆ మంత్రి సహా సీఎం రేవంత్ వరకు అందరి బండారం బయటపెడతాం

by Gantepaka Srikanth |
Jagadish Reddy: ఆ మంత్రి సహా సీఎం రేవంత్ వరకు అందరి బండారం బయటపెడతాం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులకు సాగునీరు, మద్దతు ధర లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. దళారుల చేతుల్లో రైతులు దోపిడీ గురికావడానికి కారణం మంత్రులే అని ఆరోపించారు. సోమవారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి సహా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరకు అందరి బండారం బయటపెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. రైతులపై ప్రభుత్వ కుట్రను త్వరలో బయటపెడతామని షాకింగ్ ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వా(Congress Govt)నికి చివరి రోజులు ప్రారంభమయ్యాయని అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంటే.. బాంబులు వేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని సీరియస్ అయ్యారు. సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయని విమర్శించారు. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని విమర్శించారు. తెలంగాణలో పోలీస్ శాఖ(Telangana Police Department) ఒక్కటే ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు పని చేస్తుందన్నారు. స్కూళ్లలో పిల్లలు చనిపోతున్నారని, దవాఖానల్లో మందులు అందుబాటులో లేక డాక్టర్లు బయట నుంచి తెచ్చి వైద్యం చేస్తున్నారన్నారు. వికారాబాద్‌లో అధికారులపై ప్రజలు దాడి చేయడం ప్రభుత్వ పరిపాలన విధానానికి నిదర్శనమన్నారు. మోసపూరిత మాటలను ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారిని భయపెట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు.

Advertisement

Next Story