అదానీది ప్రపంచలోనే అతి పెద్ద స్కామ్: మాజీ IAS Akunuri Murali సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-02-04 09:46:18.0  )
అదానీది ప్రపంచలోనే అతి పెద్ద స్కామ్: మాజీ IAS Akunuri Murali సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎవడన్నాడు దేశం/రాష్ట్రం పేదది అని.. ఈ రాజకీయ/ కార్పొరేట్ దొంగలు దేశాన్ని పేదదిగా మారుస్తున్నారని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక తీవ్ర వివాదాస్పదమవుతుంది. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. మరోవైపు, ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇదీ బీజేపీ/మోడీ మార్కు అవినీతి అంటూ విమర్శలు గుప్పించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం అని ఆరోపించారు. అవినీతి చేసిన ఇన్ని లక్షల కోట్లతో దేశంలో పేదరికాన్ని పూర్తిగా తీసేయచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయ/ కార్పొరేట్ దొంగలు దేశాన్నిపేదదిగా మారుస్తున్నారని ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story