- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వేళ.. TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆసక్తికర ట్వీట్!
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగే లీకులకు పాల్పడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీపై విపక్షాలు, నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాల భర్తీని కూడా పారదర్శకంగా నిర్వహించలేకపోతున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన టీఎస్‌పీఎస్‌సీ సమగ్ర విచారణ జరిపి మొత్తం ఐదు పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సోషల్ మీడియా వేదికగా శుక్రవారం రాత్రి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘మాట్లాడటానికి నీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నా.. కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండటమే ఉత్తమం’ అంటూ ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మీ ట్వీట్‌కి మాకు అర్థమైంది. ఇక కేసీఆర్, కేటీఆర్‌లు అర్థం చేసుకోవాలి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. ‘జరగాల్సిన నష్టం జరిగిపోయింది సార్.. ఒక నేరస్థుడు చేసిన తప్పుకి లక్షల మంది నిరుద్యోగులకు శిక్ష పడింది’ అంటూ మరో నిరుద్యోగి ఆవేదన చెందారు. అయితే, పేపర్ లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి ఉన్నప్పుడే మొదలైదంటూ నిరుద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన పై విధంగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.