- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ శాఖలో అన్నీ అక్రమాలే..! ఆఫీసర్‌తో కలిసి చక్రం తిప్పుతున్న రిపోర్టర్
దిశ, ఖమ్మం బ్యూరో : సాంఘిక సంక్షేమశాఖ అక్రమాలకు అడ్డగా మారింది. పేరులో సంక్షేమం ఉన్నప్పటికీ ఈ శాఖ చేసేది మాత్రం అన్నీ అక్రమాలే. ఇక్కడ జరిగే మాయాజాలం అంతా ఇంతా కాదు. ఒకటి కాదు.. రెండు కాదు.. చేయడానికి వీలున్న అన్ని అక్రమాలు చేస్తున్నారు. కొన్ని ఇప్పటికే బయటకు పొక్కితే బయటపడని ఎన్నో ఘటనలున్నాయి. ఖమ్మం సోషల్ వెల్ఫేర్ శాఖలో ఆ సారు తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. ఓ జిల్లాస్థాయి అధికారి అయి ఉండి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అక్రమంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియామకం మొదలు.. అసలు విధులు నిర్వహించకుండానే ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖలో విద్యార్థులకు పెట్టే మెనూలో సైతం తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ డబ్బులు డ్రా చేశారనే ప్రచారం జరుగుతున్నది. వీటికి తోడు ఈయన హయాంలో కార్పొరేషన్ల లోన్ల విషయంలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు సమాచారం. అంతేనా.. చెప్పినట్లు వినని ఉద్యోగులను వేధించడం, వారిపై చర్యలు తీసుకోవడం.. వారినుంచి వీలైనంత లాగడం.. వీటన్నింటికోసం ప్రత్యేకంగా ఓ బ్యాచ్‌ను ఏర్పాటు చేసిన తమ ఘనకార్యాలను చక్కపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సాంఘిక సంక్షేమశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు ఇటీవల ఓబాధితుడు ఏకంగా గ్రీవెన్స్‌లో కలెక్టర్ ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే.. ఇదంతా ఒక ఎత్తయితే.. ఓ మీడియా సంస్థలో పనిచేసే విలేకరి ఈ శాఖలో తన పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆ సారును ఏకంగా ‘డాడీ’ అంటూ షాడోలా ప్రవర్తిసున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ శాఖలో పనిచేసే కొంతమంది మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వారిని నయానో భయానో లొంగదీసుకుని ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్నా విలేకరిని వెనుకేసుకొస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఔట్ సోర్సింగ్‌లో మాయ..
సాంఘిక సంక్షేమశాఖలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భారీ ఎత్తున మాయాజాలం జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. అక్రమంగా కొందరిని ఉద్యోగాల్లో నియమిస్తే.. ఇంకొందరేమో అసలు ఉద్యోగంలో లేకుండానే ఏళ్ల తరబడి జీతాలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఖమ్మం ఆనంద నిలయంలోని కాంప్లెక్స్ హాస్టల్లో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఒక్క రోజు కూడా పని చేయకుండానే ఏళ్లుగా వేతనం పొందినట్లు సమాచారం. సత్తుపల్లిలో సైతం ఇదే విధంగా విధులకు హాజరుకాకున్నా వేతనాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే బయటకు రానివి ఇంకా ఎన్నో ఉంటాయని ఆ శాఖకు చెందిన ఉద్యోగులే చెప్పడం గమనార్హం.
ఎస్సీ కార్పొరేషన్ లోన్లలోనూ..
నిరుపేద ఎస్సీ యువత కోసం ప్రభుత్వం చేయూత నిచ్చేందుకు ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం. సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించిన ఓ ముఠా ఎస్సీ యువతకు లోన్లు ఇప్పిస్తామంటూ వారికి మంజూరు కాగానే భారీగా వాటా తీసుకుంటున్నారని సమాచారం. ఈ లోన్లు సైతం ఎక్కువగా తమవారికే ఇచ్చారనే పుకార్లు వినిపిస్తున్నాయి.
సంక్షేమ శాఖకు పెద్ద అయి ఉండి.. అర్హులైన ఎస్పీ యువతకు లోన్లు ఇవ్వకుండా కమీషన్లు ఇచ్చినవారికే మంజూరు చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.. బెదిరించిన కుల సంఘాల నాయకులు పలువురికి కూడా రుణాలు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులు కాకున్నా రుణాలిచ్చి అర్హులకు అన్యాయం చేయడం ఈయనకే దక్కింది.
పిల్లల మెనూలోనూ తప్పుడు లెక్కలు..
సాంఘిక సంక్షేమ శాఖలోని హాస్టల్ విద్యార్థులకు పెట్టే భోజనంలోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. పిల్లలు తక్కువగా ఉన్నచోట ఎక్కువ మందిని చూపుతూ తప్పుడు లెక్కులు సమర్పించి బిల్లులు డ్రా చేసిన ఘటనలు పలు చోట్ల జరుగుతున్నా.. ఏం పట్టనట్లు వ్యవహరిస్తారని.. ఫిర్యాదులు వెళ్లినా స్పందించరనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో పిల్లలు హాజరు కాకున్నా.. తప్పుడు బిల్లులు పెట్టినట్లు తెలుస్తున్నది. ప్రతి హాస్టల్ నుంచి అధికారికి నెలవారీ మామూళ్లు వెళ్తుంటానే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
అంతా ఆ విలేకరే అట..
ఇక సోషల్ వెల్ఫేర్‌లో జరిగే అక్రమ పనులను ఓ విలేకరికి దగ్గరుండి చక్కబెడతారనే ప్రచారం జరుగుతున్నది. అవుట్ సోర్సింగ్‌లో అక్రమ నియామకాలు జరిగే తంతులో ఈయనదే ముఖ్యపాత్ర అని టాక్. సదరు విలేకరి భార్య సైతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏళ్లుగా నెలకు వేలల్లో జీతాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో ముందుగానే అలర్ట్ అయిన పెద్దసారు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తున్నది. ఆ విలేకరి సాంఘిక సంక్షేమ శాఖలో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది వ్యవహారం. ఆశాఖలో పనిచేసే ఉద్యోగులను బెదిరించడం.
వారి నుంచి వసూళ్లకు పాల్పడం.. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం పరిపాటిగా మారినా.. ఆ విలేకరిని వెనుకేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశాఖలో పనిచేసే ఓ ఉద్యోగినితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్త.. ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం బహిర్గతమైంది. అయితే సదరు బాధితుడు ఎన్నిసార్లు చెప్పినా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు ఆ విలేకరిని మంగళవారం చితకబాదినట్లు సమాచారం.