హాలిడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకోకండి.. అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

by sudharani |   ( Updated:2023-11-30 12:25:42.0  )
హాలిడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకోకండి.. అల్లు అరవింద్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే సొంత ఊర్లకు చేరుకుని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటు వేసి బయటకు వచ్చిన నిర్మాత అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వెళ్లి ఓటు ఏం వేస్తానులే అని ఇంట్లో కూర్చుంటారు చూడండి. వాళ్లు అందరకి ఒకటి చెప్తున్న.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏ ప్రభుత్వం వస్తుంది.. అది మనకు ఏం చేస్తుంది అనుకోవద్దు. ఎలాగో ప్రభుత్వం ఈ రోజు హాలిడే ఇచ్చింది కదా అని ఇంట్లోనే బీరు తాగి పడుకోవద్దు. ఎందుకంటే తర్వాత రోజు ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు నీకు ఉండదు. అందరూ లేచి వచ్చి ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story