తెలంగాణ గడ్డ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజు వస్తుంది: ఈటల

by GSrikanth |
తెలంగాణ గడ్డ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజు వస్తుంది: ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అలయ్-బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గడ్డమీద నుంచి కేసీఆర్‌‌ను తరిమికొట్టే రోజు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో ప్రభుత్వం రియల్ ఏస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తిందని తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని వృథా చేయడానికే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండిన పంటను అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగేలా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఆర్టీసీ కార్మికులకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.

Advertisement

Next Story