- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Etela Rajender: ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయడమేంటి?
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ కలెక్టర్(Vikarabad Collector)పై దాడి ఘటనలో రైతులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) ఖండించారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం(Lagacharla village)లో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. దీనిని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయడం ఏంటని ప్రశ్నించారు.
అక్రమ కేసులు పెడితే తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని.. దానికి ఇదే నిదర్శనం అని అన్నారు. మరోవైపు.. కలెక్టర్‌పై దాడి అనంతరం 55 మంది రైతులను పరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లగచర్ల, రోటి బండతండా, ఫుల్‌చర్ల కుంట, హకీంపేట్, పాలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం 40 మందిని విడుదల చేయగా.. మరో 15 మంది రైతులను పోలీసులు విచారిస్తున్నారు.