- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ సోషల్ వార్.. స్టేట్ ఆఫీస్‌లో ఆయన అనుచరుల హల్ చల్..
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. నిన్నటి వరకు లీడర్ల మధ్య విభేదాలు బయటపడగా నేడు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. ఈటల అనుచరులు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా వింగ్ వద్ద హల్ చల్ చేశారు. ఈటలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని నానా హంగామా సృష్టించారు. వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంటూ వార్తలు వచ్చిన సమయంలో అటు బండి వర్గం, ఇటు ఈటల వర్గం ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ సమయంలో గ్రూపులుగా విడిపోయి ఆయా నేతలకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోస్టులు చేసి రచ్చ చేశారు. తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ చార్జీల సమావేశానికి నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గీయులు ఈటలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి.
ఇదిలా ఉండగా ఈటల వర్గీయులపై పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఈటల వర్గం కంట్రోల్ తప్పడంపై మండిపడుతున్నారు. ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయాల్సింది పోయి ఇలా చేయడమేంటని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని పలువురు చెబుతున్నారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చాలని ఈటల వర్గీయులు కావాలనే ఇలా చేస్తున్నారని నేతలు చెబుతున్నారు. ఈటలతో పాటే బీజేపీలో చేరిన ఆయన అనుచరులు పలువురికి బీజేపీ సీనియర్ కార్యకర్తలకు మధ్య గతం నుంచే వైరుధ్యాలున్నట్లు తెలుస్తోంది.
కాగా బీజేపీ సోషల్ మీడియా ఇన్ చార్జీ ప్రశాంత్ తో దూషణకు దిగిన వారిలో ఈటల, కిషన్ రెడ్డి అనుచరులు అమర్ నాథ్, గిరివర్ధన్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా రూమ్ కు తాళం వేసి దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఈటల మనుషులే ఉంటారని, ఆయన చెప్పిందే పార్టీలో నడుస్తుందని ఈటల అనుచరులు నినాదాలు చేసినట్లు చెబుతున్నారు. కాగా ఈటల అనుచరులు దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైనట్లు పలువురు నేతలు చెబుతున్నారు. కాగా బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు.