- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి ఈటల రాజీనామా.. క్లారిటీ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ, చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా, ఎట్టకేలకు దీనిపై ఈటల క్లారిటీ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా గార్ల నాయకత్వంలో ఒక సైనికుడిలా పని చేస్తున్నానని తెలిపారు. చాలా రోజుల నుంచి నేను పార్టీ మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకులకు నాకు పడటం లేదని ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. కానీ వారికి నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.
పార్టీ మార్పుపై పత్రికల్లో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నేను పార్టీలు మార్చే వ్యక్తిని కాదు. మా అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని హెచ్చరించారు . అలాగే కేసీఆర్ కుటుంబ పాలను అంత చేయడం బీజేపీతోనే సాధ్యం అవుతుంది, అదే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు.