- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా చూసేది బీఆర్ఎస్ నేతలే.. మంత్రి కేటీఆర్‌కు ఈటల స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: ఇది ట్రైలర్ మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని.. సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని సెటైర్ వేశారు. అంతేకాకుండా ఆగస్ట్ 15వ తేదీన ఎల్బీ నగర్ పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనపైన ఈటల స్పందించారు.
స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే.. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి ఘటనలో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాగా, ఆగస్ట్ 15వ తేదీన ఎల్బీ నగర్‌లో పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గవర్నర్ సైతం స్పందించి.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీని గవర్నర్ ఆదేశించారు.
Read More: ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు