- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత జాతిని మోసం చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్యే ఈటల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీసీ సామాజిక వర్గాలు పూర్తిగా విస్మరించబడ్డారని ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలని, ఆ పార్టీల్లో బీసీలకు 20 స్థానాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
దేశ చరిత్రలో తొలిసారిగా దళిత మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదన్నారు. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని, బీసీ సమాజం ఆలోచించాలని, బీజేపీకి ఒక్క సారి అవకాశం కల్పించాలన్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు.
బీసీలకు బీజేపీలోనే రాజ్యాధికారం: ఈటల
కేసీఆర్‌కు బీసీలంటే చిన్న చూపు అని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మరోవైపు దళిత జాతిని మోసం చేసిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ సమాజాన్ని మోసం చేశాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదని, బీజేపీ బీసీలకు రాజ్యాధికారం ఇస్తోందని అన్నారు.
ఓట్ల కోసమే బీసీ సమాజం కాదు.. రాజ్యాధికారం కోసం బీసీ సమాజం ఉండాలని ఈటల అన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆశయాలు నెరవేరలేదన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరని చూడకుండా ప్రజలు బీజేపీకి ఓట్లేయ్యాలని పిలుపునిచ్చారు.