అసెంబ్లీలో తెలంగాణ సర్కారుపై ఈటల ఫైర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-08 09:42:16.0  )
అసెంబ్లీలో తెలంగాణ సర్కారుపై ఈటల ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ తెలంగాణ సర్కార్‌పై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. జీఎస్ డీపీలో 25 శాతానికి మించి అప్పులు చేయకూడదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీపీలో 38 శాతం అప్పులు చేసిందన్నారు. బీసీల కోసం బడ్జెట్ లో పెట్టిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు ప్రతినెలా చెల్లించాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు రైతు రుణమాఫీని పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు వసతి కల్పించడం లేదని మండి పడ్డారు. బీజేపీ సభ్యులకు కనీసం టిఫిన్ చేసే అవకాశం లేదన్నారు.

Advertisement

Next Story