- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Errabelli Dayakar Rao: ఎవరి కుర్చీలు కదులుతాయో త్వరలోనే చూద్దాం.. పొంగులేటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి రాక ముందు తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో రెండు, మూడు బాంబులు పేలబోతున్నాయని.. గత ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Former Minister Errbelli Dayakar Rao) తనదైన స్టైల్లో స్పందించారు. మంత్రి చెప్పింది కరెక్టేనని.. దీపావళికి 100 శాతం బాంబులు పేలబోతున్నాయని కామెంట్ చేశారు.
అయితే, ఆ బాంబులు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోనే పేలబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government)కు వస్తున్న ముప్పును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ముందుగానే పసిగట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదారి అయ్యారని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కొత్త డ్రామాలకు తెర లేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల కనీసం అపాయింట్‌మెంట్ (Appointment) కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఎవరి కుర్చీలు కదులుతాయో త్వరలోనే చూస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.