కేరళలో విపత్తుకు మానవతప్పిదమే కారణం: పర్యావరణ వేత్త

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-04 14:51:23.0  )
కేరళలో విపత్తుకు మానవతప్పిదమే కారణం: పర్యావరణ వేత్త
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్ జిల్లాలో సంభవించిన విపత్తుకు మానవ తప్పిదాలే కారణమని ప్రముఖ పర్యావరణ వేత్త భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళ విపత్తుపై స్పందించారు. ‘విపరీతంగా చెట్లు నరికివేశారు. కొండలపై లాకింగ్ సిస్టమ్ చెదిరిపోయింది. లాకింగ్ సిస్టమ్ పోవడంతో భూమిలోకి నీరు ఇంకడం లేదు.

ఇలాగే అనంతపురం జిల్లాను సర్వనాశనం చేశారు. అధికారులకు ఎన్ని లేఖలు రాసినా ఉపయోగం లేకుండా పోయింది. ఒక్కరు కూడా తమ లేఖలను పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు’ అని పర్యావరణ వేత్త భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల వయనాడ్‍లో మహా విషాదం జరిగింది. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 360 మృతి చెందారు. ఇంకా సుమారు 200 మంది ఆచూకీ కనుగొనాల్సి ఉంది. భారీస్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా బలగాలు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed