- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తునికాకు సేకరణతో ఉపాధి.. పూర్తయిన టెండర్ ప్రక్రియ
దిశ, ఏటూరునాగారం: గిరిజనులకు, గిరిజనేతరులకు ఉపాధి పని దొరకనుంది. సంవత్సరకాలం నుంచి అడవి బిడ్డలు ఎదురు చూస్తున్న తునికాకు సేకరణ టెండర్ పనులు పూర్తయ్యాయి. వేసవి కాలం ప్రారంభ దశలో మొదలయ్యే తునికాకు సేకరణలో మొదటి దశ చెట్ల మొట్లు కొట్టడం ప్రారంభమైంది. నెల రోజుల్లో తునికాకులు కోతకు సిద్ధమవుతాయి.
ఈ నెల రోజులు గిరిజనులు, గిరిజనేతరులకు తునికాకు సేకరించే పనితో ఉపాధి లభిస్తుంది. గతేడాది ములుగు జిల్లా వ్యాప్తంగా తూనికాకు సేకరణ ద్వారా సుమారు 9,754 మందికి ఉపాధి లభించింది. గతేడాది ఆకుకట్ట రేటు రూ.2.05 ఉండగా ఈ యేడాది రూ.3.05 కు చేరుకుంది. దీంతో ఈ యేడు తూనికాకు సేకరణతో ఎక్కువ మందికి జీవనోపాధి లభించనుంది.
అత్యధిక సేకరణే లక్ష్యం..
గతేడాది తునికాకు సేకరణకు ములుగు జిల్లా వ్యాప్తంగా 28 యూనిట్లు ఏర్పాటు చేశారు. 19388 ఎస్బీలు(స్టాండర్డ్బ్యాగ్స్) సేకరించారు. ఈ యేడు ములుగు జిల్లా వ్యాప్తంగా 29 యూనిట్లు ఏర్పాటు చేసి 24300 ఎస్బీలు (స్టాండర్డ్బ్యాగ్స్) సేకరించే లక్ష్యంగా పని చేస్తున్నారు. గతేడాది కంటే ఈయేడు తునికాకు కట్ట రేటు రూపాయి పెరగడంతో సేకరణకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
సేకరణ, స్టాండర్డ్ బ్యాగు వివరాలు..
తునికాకు సేకరించిన తర్వాత కట్టకు రెండు వైపులా 25+25 ఆకులను చేర్చి ఒక కట్టగా తయారు చేస్తారు. వెయ్యి కట్టలు కలిపితే ఒక స్టాండర్డ్ బ్యాగుగా లెక్కిస్తారు. కట్టకు ప్రస్తుత ధర రూ.3 ఉండగా ఒక స్టాండర్డ్ బ్యాగు ధర రూ.3వేలు పలుకుతుంది. జిల్లా వ్యాప్తంగా తునికాకు సేకరణ ద్వారా గతేడాది 19388 ఎస్బీలు సేకరించగా రూ.39,745,400 వ్యాపారం జరిగింది. కాగా పెరిగిన ధర ప్రకారం ఈయేడు 24,300 ఏస్బీలు సేకరణ లక్ష్యంగా కాగా రూ.72,900,000 వ్యాపారం జరుగనుంది.