‘దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవోను రద్దు చేయండి’

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-21 15:13:46.0  )
‘దొడ్డిదారిన తీసుకొచ్చిన జీవోను రద్దు చేయండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోస్టర్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్‌సౌధ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. టీఓఓ 954 దానిని అనుంబంధ ఆర్డర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యామ్‌మనోహార్‌, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్‌ మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గత ప్రభుత్వంలోని యాజమాన్యం ఎలాంటి జీఓలు లేనప్పటికీ దొడ్డిదారిన తీసుకొచ్చిన టీఓఓ 954, ఎన్‌ఓఓ 37, ఎస్‌పీఓఓ101, టీజీఓఓ 62లను వెంటనే రద్దు చేసి, ఉద్యోగులు సీనియార్టీ జాబితాను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌లో వచ్చిన పోస్టుల్లో సీనియార్టీని రోస్టర్‌ విధానంలో నిర్ణయించి ఇచ్చిన అడ్‌హాక్‌ ప్రమోషన్లను రెగ్యులరైజ్‌ చేయాలని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కాన్‌సీక్వెన్సీయల్‌ సీనియారిటీని అమలు చేస్తూ ఉద్యోగులందరికీ ఇచ్చిన అడ్‌హక్‌ ప్రమోషన్లు రెగ్యులరైజ్‌ చేయాలని, రెండో శ్రేణి పౌరులుగా చూపబడుతున్న 23 వేల మంది ఆర్టిజన్లకు ఏపీబీఎస్‌ఈబీ రూల్స్‌ను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి చంద్రయ్య. సోమ్లా నాయక్, నారాయణ నాయక్, నాగరాజు, ఆనంద్ బాబు, ఆనందం, కుమారస్వామి, సత్యనారాయణ, శరత్ చంద్ర, రవీందర్, కృష్ణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed