చీకటి వలయంగా తహసీల్దార్ కార్యాలయం

by GSrikanth |
చీకటి వలయంగా తహసీల్దార్ కార్యాలయం
X

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో అద్దె కట్టలేదని తహసీల్దార్ కార్యాలయానికి భవన యజమాని తాళం వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఉన్న కార్యాలయానికి కొత్త విద్యుత్ మీటర్ లేక పవర్ సప్లై ఆగిపోయి చీకటి వలయంగా మారింది. ఇటీవలే తహసీల్దార్ కార్యాలయాన్ని అద్దె భవనంలో నుండి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోకి మార్చిన విషయం తెలిసిందే.

కాగా, ముందు ఉన్న అద్దె భవనంలో సుమారు లక్ష రూపాయల వరకు కరెంట్ బిల్ పెండింగ్ ఉంది. దీనికి రూ.50 వేల వరకు కట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోని తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ అధికారులు కొత్త మీటర్ ఇవ్వలేదు. అప్పటినుండి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ నుండి తహసీల్దార్ కార్యాలయంలోకి విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ పవర్ కూడా తీసేయడంతో తహసీల్దార్ కార్యాలయం చీకటి వలయంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed