TGSPDCL: విద్యుత్ అంతరాయమా?..టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ కీలక ప్రకటన

by Prasad Jukanti |   ( Updated:2024-08-20 05:49:15.0  )
TGSPDCL: విద్యుత్ అంతరాయమా?..టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గాలులతో కూడి భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారులు అప్రమతంతగా ఉన్నారని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 1912 కు లేదా జిల్లా/ సర్కిల్ కేంద్రాల్లో గల విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని గద్వాల్ జిల్లా అలంపూర్ సబ్ డివిజన్ పరిధిలో నిన్న బలమైన గాలులతో కూడిన కురిసిన భారీ వర్షానికి 45 కిలోమీటర్ల పొడవు గల శాంతినగర్ 33 కేవీ లైన్ లో ఏర్పడిన సాంకేతిక లోపం ఏర్పడింది. దీని వల్ల రామాపురం, చాగల్పూర్, పీటీ పాడు 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలోని 16 గ్రామాల్లో సరఫరా అంతరాయం ఏర్పడింది. ఫీడెర్ బ్రేక్ డౌన్ కావడంతో అప్రమత్తమైన సిబ్బంది భారీ వరదలు, చీకటిని సైతం లెక్కచేయకుండా పొలాల్లోని లైన్ టు లైన్ పెట్రోలింగ్ చేసి ఎనిమిది ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై పగిలిన ఇన్సులేటర్లను, మరో రెండు ప్రాంతాల్లో పిన్ బైండింగ్స్ ను గత రాత్రి సరిచేసి సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed