- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రత్యక్ష పద్ధతిలోనే సచివాలయ సంఘం ఎన్నికలు: ఎన్ నరేందర్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాలయ సంఘానికి ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగుల ఎల్డర్స్ మీటింగ్ లో ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం సచివాలయ సంఘ భవనంలో నిర్వహించిన ఈ మీటింగ్‌లో అధ్యక్షుడు నరేందర్ రావు మాట్లాడుతూ..సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం అవసరమైతే వంద మెట్లు దిగి వచ్చి, పరిష్కరించుకుంటామని అన్నారు. వచ్చే డిసెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి సంఘం బాధ్యతలు ప్రజాస్వామ్య యుతంగా కొత్త టీమ్ ను ఎన్నుకుంటామన్నారు. బైలాస్ సవరణ ప్రక్రియను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని ప్లాన్ చేశామన్నారు.
ఇక భవిష్యత్తులో కో ఆర్డినేషన్ కమిటీల్లో వివిధ సంఘాల బాధ్యులు సభ్యులుగా కొనసాగుతూ సచివాలయంలో వివిధ స్థాయిల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సమన్వయంగా పనిచేయాలన్నారు. ఇక త్వరలో సచివాలయ అధికారుల సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ శంకర్ ను ఎన్నికల అధికారి గా ఎన్నుకున్నారు. అతి త్వరలో ఎన్నికలు నిర్వహించి, కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేందుకు తన వంతు పాత్రను పోషిస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు ప్రసాద్, సురేష్ కుమార్, రామ్ సింగ్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.