Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ ఫోకస్.. సెప్టెంబర్ 21న ఫైనల్ లిస్ట్

by Prasad Jukanti |
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ ఫోకస్.. సెప్టెంబర్ 21న ఫైనల్ లిస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథఅయంలో పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది. లోకల్ బాడీ ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా వెల్లడిస్తామని ఎస్ఈసీ బుధవారం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్ 9,10వ తేదీలలో రాజకీయపార్టీల సూచనలు స్వీకరిస్తామని, ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం ద్వారా ఇక రాష్ట్ర రాజకీయాల్లో తమ బలాన్ని రెట్టింపు చేసుకోవాలి అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దక్కిన ఓటు షేర్ ను కంటిన్యూ చేసి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని కమలంపార్టీ కర్యచరణ అమలు చేస్తున్నది. ఇక రాష్ట్రంలో అధికారం దూరం కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోవడంతో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గి తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికల రాజకీయం మంరిత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed