విద్యావ్యవస్థ అస్తవ్యస్తం.. ఎంఈవోల భర్తీపై కోర్టు కేసు!

by Geesa Chandu |
విద్యావ్యవస్థ అస్తవ్యస్తం.. ఎంఈవోల భర్తీపై కోర్టు కేసు!
X

దిశ, ఆసిఫాబాద్: విద్యాశాఖలో పర్యవేక్షణాలోపం నెలకొంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్నేళ్లుగా రెగ్యులర్ ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. ఆయా మండలాల్లోని సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలనే ఇన్చార్జీ ఎంఈవోలుగా నియమించి నెట్టుకొస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలున్నాయి. మరో పక్క జిల్లాలో ప్రైవేటు పాఠశాలల ఆగడాలు కూడా విజృంభిస్తున్నాయి. రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో సైతం జిల్లా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు.

ఎంఈవోల భర్తీపై కోర్టు కేసు..

ఎంఈవోల పోస్టుల భర్తీ విషయమై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కారణంగా పదేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ ఎంఈవోలు కరువయ్యారు. పదేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలు యూపీఎస్ లో హెచ్ఎంలు ఎంఈవో పోస్టుల కోసం కోర్టుకేక్కారు. వీరి ఆందోళన సుప్రీం కోర్టుకు చేరడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపో యింది. దీంతో జిల్లాలోని 15 మండలాల్లో ఇన్చార్జి ఎంఈవోలే దిక్కుయ్యారు. ఇన్చార్జి ఎంఈవోలే జిల్లాలో ని సుమారు 1200 ప్రభుత్వ పాఠశాలల నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల పై పర్యవేక్షణ లోపించింది. జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.

పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ...

ఎంఈవోల పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాలల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. ఉపాధ్యా యులు సమయపాలన లేక. విద్యాబోధన.కానీస వసతు ల కల్పన మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా సాగడం లేదనే వాదన ఉంది. తాము పాఠశాలలతో పాటు ఎంఈవోల పర్యవేక్షణ లో చేయాల్సిన పనులన్నీ తామే చేయడంతో అధిక భారం పడుతున్నదని ఫలితంగా బోధన పై దృష్టి పెట్టలేక పోతున్నామని హెచ్ఎంలు వాపోతున్నారు.

కాంప్లెక్స్ హెచ్ఎంలకు బాధ్యతలు..

ఎంఈవోల పదోన్నతులు భర్తీ విషయమై సుప్రీం కోర్టులో కేసు ఉండడంతో భవిష్యత్తులో ఎంఈవో పోస్టులు భర్తీ చేయకుండా కాంప్లెక్స్ హెచ్ఎంలకే బాధ్యతలు అప్పగించేందు కు సమాలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఆలోచనతో ఎంఈవో పోస్టుల భర్తీ పై ఆసక్తి చూపడం లేదనే ప్రచారంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed