హైకోర్టును ఆశ్రయించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Mahesh |
హైకోర్టును ఆశ్రయించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓబుళాపురం గనుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గనుల కేసు నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ ను సీబీఐ కోర్టు ఇటీవలే కొట్టివేసింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టులో ఓఎంసీ విచారణపై స్టే విధించాలని కోరారు. కాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ కేసు విచారణలో వేగం పెంచింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు… నిందితులపై అభియోగాల నమోదు కు సంబంధించి విచారణ సాగించింది.

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రిటైర్డ్ అధికారులు కృపానందం, వీడీ రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ లు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ కేసులో తాను దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్ ను గాలి జనార్దన్ రెడ్డి గతంలోనే ఉపసంహరించుకోగా విచారణ నుంచి తమ పేర్లను తప్పించాలంటూ మిగతా నిందితులు దాఖలు చేసిన అన్ని డిశ్చార్జీ పిటిషన్లను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గతేడాది అక్టోబర్ లో కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Next Story

Most Viewed