DSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీలక సూచన చేసిన విద్యాశాఖ

by Satheesh |
DSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీలక సూచన చేసిన విద్యాశాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్సీ అభ్యర్థులు తమ హాల్ టికెట్లనె వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచనలు చేశారు. సోమవారం నాటికి 2,20,000 మంది తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగతా అభ్యర్థులు సైతం వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచనలు చేశారు. డీఎస్సీ పరీక్షలు ఈనెల 18 నుంచి జరగనున్నాయి. కాగా 2.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా మరో 50 వేలకు పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. schooledu.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed