మంత్రి సీతక్కను కలిసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

by Y. Venkata Narasimha Reddy |
మంత్రి సీతక్కను కలిసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యా కమిషన్ చైర్మన్ గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క

విద్యా కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఆకునూరి మురళికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం వారిరువురు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. తెలంగాణలో ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్శిటీ స్థాయి వరకూ నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ చైర్మన్‌గా నియమించటంతో తెలంగాణ విద్యావ్యవస్థ లో సమగ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed