ఢిల్లీ: కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ

by GSrikanth |   ( Updated:2024-03-16 05:38:33.0  )
ఢిల్లీ: కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శనివారం ఉదయం రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. అయితే, నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఈడీ, ఐటీ అధికారుల సుదీర్ఘ సోదాల అనంతరం అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story