- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ED: ఈడీ అదుపులో సాహితి ఇన్‌ఫ్రా ఎండీ.. ఐదు రోజుల పాటు విచారణ
దిశ, డైనమిక్ బ్యూరో: కోర్టు ఆదేశాల ప్రకారం సాహితి ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనుంది. సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో లక్ష్మీ నారాయణను విచారించేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో ఆయనను నిన్న అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఈడీ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై లక్ష్మీ నారాయణను ఈడీ విచారించనుంది. అంతేగాక ప్రీ లాచింగ్ పేరుతో ఎవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు అనే వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా లక్ష్మీ నారాయణ సహా మరికొందరు సాహితీ ఇన్‌ఫ్రాలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కోట్లలో డబ్బు వసూలు చేసి వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈడీ సాహితీ గ్రూప్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే ఇప్పటివరకు దాదాపు 1600 మంది కస్టమర్ల నుండి 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.