Delhi Liquor Case : కవిత రిక్వెస్ట్‌కు ఈడీ రిప్లై! విచారణ డేట్ ఫిక్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 04:20:38.0  )
Delhi Liquor Case : కవిత రిక్వెస్ట్‌కు ఈడీ రిప్లై! విచారణ డేట్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో కవిత చేసిన రిక్వెస్ట్ కు ఈడీ రిప్లై ఇచ్చింది. అయితే ఈడీ బుధవారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ విషయమై కవిత ఈడీకి లేఖ రాసి 11న హాజరు అవుతానని తెలిపారు. అయితే ఈ అంశంపై తాజాగా స్పందించిన ఈడీ 11న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని రిప్లై ఇచ్చింది.

ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నేషనల్ మీడియాతో కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి న్యూ ఢిల్లీలోనీ C1/8 పాన్ద్ర పార్క్‌లోనీ ఆయన ఇంట్లో ప్రెస్ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు‌పై నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. కవితను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈడీ విచారించనున్నట్లు తెలిసింది.

Read more:

Delhi Liquor Case :కేబినెట్ మీటింగ్‌ ఈడీపైనే! యాక్షన్ ప్లాన్‌పై చర్చించే ఛాన్స్

Advertisement

Next Story