ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి MLC కవిత పేరు

by GSrikanth |   ( Updated:2023-02-11 15:29:58.0  )
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి MLC కవిత పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ అధికారులు తెలంగాణ, ఢిల్లీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయగా, తాజాగా ఇప్పుడు ఈ కేసు ఏపీకి చేరింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఈ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచడంతో బీఆర్ఎస్‌ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story