- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాయంత్రం ఏం జరగబోతుంది.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ!
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. నాలుగు గంటలుగా రామచంద్ర పిళ్లైతో కొనసాగుతూనే ఉంది. అసలు ఈడీ అధికారులు ఏం విచారించారు. ఏ అంశాలను అడిగారు. కవిత ఏం సమాధానం ఇచ్చింది. అనేది హాట్ టాపిక్‌గా మారింది. పిళ్లైను విచారణ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. కవితను మాత్రం ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు.
దీంతో ఒక్కసారిగా గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎంక్వయిరీ తర్వాత ఏం చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఈనెల 11న ఈడీ అధికారులు రాత్రి 8:30 గంటల వరకు విచారణ చేపట్టారు. ఈరోజు ఎన్ని గంటల వరకు విచారణ చేస్తారు.. ఆ తర్వాత అరెస్టు చేస్తారా?.. మళ్లీ రావాలని కొరుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏ ఇద్దరు గులాబీ నేతలు కలిసినా కవిత అంశాన్నే చర్చించుకుంటున్నారు. సాయంత్రం ఏం జరగబోతుంది అనేది పార్టీలో టెన్షన్ మొదలైంది.
Read more:
భర్తకు హగ్ ఇచ్చిన కవిత.. ఈడీ విచారణకు ముందు ఆసక్తికర సీన్ (వీడియో)